వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ లోన్స్ వ్యవస్థ

భారతదేశంలో డిజిటల్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. డిజిటల్ లోన్స్ ఆర్థిక సంస్థలకు కొత్త బలాన్ని అందిస్తున్నాయి

 2022లో డిజిటల్ లెండింగ్ మార్కెట్ 270 బిలియన్ డాలర్లుగా అంచనా  వేశారు. అది 2023 చివరి నాటికి 350 బిలియన్ డాలర్లు -  2030 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు

2030 సంవత్సరంలో మొత్తం మార్కెట్‌లో డిజిటల్ రుణాల వాటా రుణాలు 60 శాతంగా ఉండొచ్చని లెక్కలు చెబుతున్నాయి

 ఈ ఏడాది మేలో Paytmకంపెనీ 5.5 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ (5,502) లోన్స్ పంపిణీ చేసింది

అదే సమయంలో, ఏప్రిల్ నుంచి  మే వరకు, దాని డిజిటల్ లోన్స్  పంపిణీ వార్షిక ప్రాతిపదికన 169 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ మొత్తం రూ. 9,600 కోట్ల (9,618) లోన్స్ ఇచ్చింది

p2p లెండింగ్, బై నౌ పే లేటర్ (BNPL), స్మాల్ అండ్ మీడియం ఎక్స్‌టర్‌ప్రైజ్ (SME) ఫైనాన్సింగ్, షార్ట్ టర్మ్ క్రెడిట్ వంటి మోడల్‌లు భారతదేశంలో డిజిటల్ లెండింగ్ మార్కెట్‌లో అత్యంత ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయి

డిజిటల్ లోన్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతోందో ఇప్పుడు అర్థమవుతోంది  ఈ లోన్స్ సులభంగా లభించడం వీటి అభివృద్ధికి ఒక ప్రధాన కారణం

ఇంతకుముందు, లోన్ కోసం -అనేక ఫారమ్‌లపై సంతకం చేయాల్సి వచ్చేది.  డిజిటల్ లెండింగ్‌లో ఈ ఇబ్బంది లేదు

బ్యాంకులు-ట్రెడిషనల్  లోన్  ఏజెన్సీలతో పోలిస్తే డిజిటల్ లోన్ ప్లాట్‌ఫారమ్‌లు రుణ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడం మరో కారణం

దేశంలోని వివిధ పిన్ కోడ్ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు లోన్‌ని పొందవచ్చు. అలాగే, లోన్ కూడా  వేగంగా లభిస్తుంది

డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రుణాలను క్రాస్ సెల్లింగ్ చేయడంకూడా ఒక కారణం

ఇవన్నీ డిజిటల్ లోన్ మార్కెట్ పెరగడానికి ముఖ్య కారణాలు. భవిష్యత్ లో ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు