Property Documents: లోన్ తీరిన వెంటనే డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వాల్సిందే

ప్రాపర్టీ లోన్స్ విషయంలో కస్టమర్లకు అనుకూలంగా రిజర్వ్ బ్యాంక్ పెద్ద నిర్ణయం తీసుకుంది. లోన్ తీరిన 30 రోజుల్లో ప్రాపర్టీ పేపర్స్ (Property Documents) కస్టమర్ కు తిరిగి ఇవ్వాలి అని ఆదేశించింది

ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఇచ్చిన ఒక ఆర్డర్ తో దినేష్ చాలా సంతోషంగా ఉన్నాడు. తన విషయంలో బ్యాంకులు చేసినట్టు మరొకరి విషయంలో జరిగే అవకాశం లేదని సంబరపడుతున్నారు. ఎందుకంటే, కొన్నాళ్ల క్రితం బ్యాంకులో తానూ తీసుకున్న హోమ్ లోన్ మొత్తం తీర్చేశాడు. అప్పు తీర్చేసిన తరువాత చాలా నెలలు తన ప్రాపర్టీ పేపర్స్(Property Documents) బ్యాంక్ నుంచి తెఇరిగి తీసుకోడానికి చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చింది. బ్యాంక్ చుట్టూ తిరిగి, తిరిగి విసిగిపోవాల్సి వచ్చింది.

RBI ఇటీవలి అడుగు తర్వాత, దినేష్ వంటి కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసుకుందాం. ప్రాపర్టీ లోన్స్ విషయంలో కస్టమర్లకు అనుకూలంగా రిజర్వ్ బ్యాంక్ పెద్ద నిర్ణయం తీసుకుంది.

కస్టమర్‌లు లోన తిరిగి చెల్లించిన తర్వాత, బ్యాంకులు నిర్ణీత సమయంలో వారికి ఆస్తి పత్రాలను(Property Documents) తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. పత్రాలను తిరిగి ఇవ్వడంలో ఆలస్యం జరిగితే, వారు కస్టమర్‌లకు భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ కింద ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది.

ఇది అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, NBFCలు నియంత్రిత సంస్థలతో సహా ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలకు, అంటే చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు వర్తిస్తుంది. అన్ని లోన్ ఈఎంఐలు అందాయని నిర్ధారించుకోవాలని ఆర్‌బిఐ నియంత్రిత సంస్థలను కోరింది. లేదా లోన్ సెటిల్ అయిన తర్వాత… లెండర్స్ 30 రోజులలో చర, స్థిర ఆస్తికి సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను(Property Documents) తిరిగి ఇవ్వాలి.

చరాస్తిలో డిపాజిట్లు, బాండ్‌లు, డిబెంచర్లు, షేర్లు, ఆభరణాలు లేదా కారు, ఇతర వస్తువులు ఉంటాయి… అయితే స్థిరాస్తిలో పొలం, భూమి, ఇల్లు, భవనం మొదలైన అంశాలు ఉంటాయి.

కస్టమర్లు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా, ఆస్తి పత్రాల(Property Documents)ను తిరిగి ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని రిజర్వ్ బ్యాంక్ కి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వివాదాల తరహా పరిస్థితులు తలెత్తుతున్నాయని, ఆర్‌బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వు వల్ల ప్రజల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

RBI తన సర్క్యులర్‌లో, కస్టమర్‌లు తమ సౌలభ్యం ప్రకారం, లోన్ అమలులో ఉన్న బ్రాంచ్ నుంచి లేదా ప్రస్తుతం ప్రాపర్టీ పేపర్‌లు ఉంచిన బ్రాంచ్ లేదా ఆఫీస్ నుంచి డాక్యుమెంట్‌లను సేకరించుకుని అవకాశం ఇస్తారు.

ఇది మాత్రమే కాదు, లోన్ శాంక్షన్ లెటర్ లో ప్రాపర్టీ డాక్యుమెంట్(Property Documents) తిరిగి వచ్చే తేదీ.. స్థలాన్ని పేర్కొనవలసిందిగా బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీత మరణిస్తే చట్టబద్ధమైన వారసులకు డాక్యుమెంట్స్ అందజేయడానికి లెండర్స్ స్పష్టమైన విధానాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ వివరాలను వారి వెబ్‌సైట్‌లో కూడా చూపించవలసి ఉంటుంది.

బ్యాంకులు లేదా ఇతర సంస్థలు 30 రోజులలోపు ఆస్తి పత్రాల(Property Documents)ను తిరిగి ఇవ్వలేకపోతే… వారు కస్టమర్‌లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు-సంస్థలు ఆలస్యమైన విషయాన్ని ముందుగా కస్టమర్‌లకు తెలియజేయాలి. వారి వల్ల అంటే నియంత్రిత సంస్థ వలన ఆలస్యమైతే, అప్పుడు కస్టమర్‌లకు ఆలస్యమయ్యే ప్రతి రోజు పరిహారంగా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఆస్తి పత్రాలకు ఏదైనా నష్టం జరిగితే… ఆపై నకిలీ పత్రాల(Property Documents)ను పొందడంలో కస్టమర్‌కు సహాయం చేయడం బ్యాంక్ లేదా సంబంధిత సంస్థ బాధ్యతగా ఉంటుంది. రుణదాత ఖర్చు భరించవలసి ఉంటుంది. ఇది పరిహారం మొత్తం కాకుండా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఈ దశ తర్వాత, దినేష్ వంటి ఇతరులు తమ పత్రాలను తిరిగి పొందడానికి నెలల తరబడి బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు.

ఆస్తి పత్రాలను డిసెంబర్ 1, 2023న లేదా ఆ తర్వాత వాపసు చేయాల్సిన కేసులకు RBI ఆర్డర్ వర్తిస్తుంది.

Published: September 25, 2023, 13:06 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.